దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ (NDA Meet) ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులోభాగంగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పాక్‌లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు గాను పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ప్రధాని మోదీని ఎన్డీయే నేతలు సన్మానించారు. మరోవైపు ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) గంటల వ్యవధిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో వేర్వేరుగా రాష్ట్రపతి భవన్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ