నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 308 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!
ముంబై, 5 ఆగస్టు (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81 వేల పాయింట్లకు దిగువకు పడిపోయింది. ఆటో మినహా చాలారంగాల్లో అమ్మకాలు కనిపించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,946.43 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది
స్టాక్ మార్కెట్


ముంబై, 5 ఆగస్టు (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం

నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81 వేల పాయింట్లకు దిగువకు పడిపోయింది. ఆటో మినహా చాలారంగాల్లో అమ్మకాలు కనిపించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,946.43 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,010.49 గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,554.40 పాయింట్లకు పడిపోయింది. చివరకు 308.47 పాయింట్లు తగ్గి 80,710.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.20 పాయింట్లు పతనమై.. 24,649.55 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనల నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

అయితే, ఆటో స్టాక్స్ మాత్రం కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కించాయి. ఆటో ఇండెక్స్ 0.4 శాతం పెరగ్గా.. బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande