దిల్లీ: 5 ఆగస్టు (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది. ప్రతి ఏటా బికనీర్ నుంచి దాదాపు రూ.2500 కోట్ల విలువైన కార్పెట్‌లు ఎగుమతి అవుతాయి. అందులో 70% అమెరికాకే వెళుతుంది. ఇక్కడి కార్పెట్ పరిశ్రమ స్థానిక స్థాయిలో ఉపాధిని కల్పించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ప్రత్యక్ష, 50 లక్షల మంది పరోక్ష కార్మికులు దీనితో సంబంధం కలిగి ఉన్నారు. సుంకం విధించిన తర్వాత, కార్పెట్ తయారీ ఖర్చు పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడటం కష్టమవుతుంది. అందుకే పరిశ్రమలకు మద్దతు ప్యాకేజీలు ఇవ్వాలి అని రాజస్థాన్ ఉన్ని పరిశ్రమల సంఘం అధ్యక్షుడు కమల్ కల్లా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ