దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా ఈడీ తాజా విచారణ ప్రకారం, చంగూర్ బాబా తన డబ్బులను నేరుగా తన పేరుపై కాకుండా నవీన్ రోహ్రా, అతని భార్య నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్) పేర్లపై ఆస్తులుగా వేసినట్లు గుర్తించారు.
ఇకపోతే, ఇప్పటికే గత నెలలో ఈడీ చంగూర్ బాబాను కూడా కస్టడీలోకి తీసుకుంది. బల్రాంపూర్ జిల్లా, ముంబయిలో రెండు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించగా, చంద్ ఔలియా దర్గాలో భారీగా అక్రమాలకు ఆధారాలు లభించాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ