అమరావతి, 5 ఆగస్టు (హి.స.)మద్యం పాలసీ అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ కొత్త బార్ పాలసీ (New Bar Policy) ఉండనున్నట్లు పేర్కొన్నారాయన. మద్యం వల్ల పేదల ఒల్లు, ఇల్లు గుల్ల కాకుండా చూడాలని తయారీదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే బార్లలో గీత కార్మిక వర్గాలకు కూడా 10 శాతం షాపుల్ని కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న మద్యం అమ్మకాలతో కొంతమేర నష్టాలను తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి