దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్‌కు సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టడంపై ఇటీవల బాలీవుడ్ నటి, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) అభ్యంతరం వ్యక్తంచేశారు. తాజాగా ఆమె వ్యాఖ్యలకు దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) కౌంటర్ ఇచ్చారు.
దిల్లీ శాసనసభలో ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్‌పై జరిగిన చర్చలో రేఖా గుప్తా మాట్లాడారు. ‘భారత్ ఇటీవల పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్‌కు సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారని జయాబచ్చన్ అడిగారు. దీనికి సినిమా భాషలోనే సమాధానం ఇస్తాను. మీకు సినిమాల గురించి మాత్రమే తెలుసు. దేశ వాస్తవ పరిస్థితుల గురించి తెలియదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. దేశాన్ని ప్రేమించలేరు కానీ, దేశ వ్యతిరేక శక్తులను మాత్రం ప్రేమిస్తారని ఆరోపించారు. భారతీయులుగా చెప్పుకుంటూ.. పాక్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ