ఎర్రకోటలో భద్రతా వైఫల్యం..
దిల్లీ: 5 ఆగస్టు (హి.స.) .స్వాతంత్ర్య వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎర్రకోట (Red Fort)లో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. విధుల్లో ఉన్న భద్రతాధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ
red fort


దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)

.స్వాతంత్ర్య వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎర్రకోట (Red Fort)లో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. విధుల్లో ఉన్న భద్రతాధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు.

స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఎర్రకోటలో స్పెషల్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. అందులోభాగంగా కొందరు భద్రతాధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారని తెలిపారు. దీంతో వారిని సస్పెండ్‌ చేశామన్నారు. ఈసందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. -

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande