ఆటోను ఢీకొట్టిన కారు.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
తూర్పుగోదావరి, 5 ఆగస్టు (హి.స.)జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని తుని గ్రామీణం, హంసవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్తున్న ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఏడుగ
ఆటోను ఢీకొట్టిన కారు.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు


తూర్పుగోదావరి, 5 ఆగస్టు (హి.స.)జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని తుని గ్రామీణం, హంసవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్తున్న ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులతో సహా డ్రైవర్, మరో ప్రయాణికురాలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యారు. దీంతో రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ తరుణంలో గాయపడ్డ వారిని తుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణామాచారి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande