దిల్లీ: 5 ఆగస్టు (హి.స.) ఉగ్రదాడికి తగిన ప్రతీకారం తీర్చుకునే విషయంలో భారత నెగ్గిందని, ఉగ్రవాదం ఓడిందని.. దృఢ సంకల్పం, దూరదృష్టి గల నాయకత్వం ఇందుకు సారధ్యం వహించిందని ఎన్డీఏ తీర్మానించింది. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్‌లో సైనికుల శౌర్యానికి ఎన్డీఏ సభ్యులు అభినందనలు తెలిపారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎన్డీఏ ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు.
నేడు (మంగళవారం) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నిర్వహించిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్‌లు విజయవంతమైన నేపధ్యంలో సభ్యులు ప్రధాని మోదీని హర్షద్వానాలతో ఆహ్వానించారు. ‘హర్ హర్ మహాదేవ్’అంటూ నినాదాలు కూడా చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు మోదీని ఘనంగా సత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ