దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యం అయినా, ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టికెట్ గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఎలా అంటే.. ఇకపై మీరు బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే, మీరు మళ్లీ మధ్యలో ఎక్కడైనా ఎక్కాలన్నా, టికెట్ ఈజీగా దొరుకుతుంది. టికెట్ ముందుగా బుక్ చేయకపోయినా, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు రియల్ టైమ్‌లో చూసి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ సౌకర్యం దక్షిణ రైల్వే (South Railway) కింద నడిచే 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ