పచ్చిగా ఉందనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. రెండే రెండు రెబ్బలు తింటే డాక్టర్‌తో పని ఉండదిక..
కర్నూలు, 6 ఆగస్టు (హి.స.)మన వంటింట్లో ఎన్నో సహజ ఔషధాలు దాగున్నాయి.. మీరు తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే.. పచ్చి వెల్లుల్లి మీకు అద్భుతంగా సహాయపడుతుంది. దీనికి బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడ
పచ్చిగా ఉందనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. రెండే రెండు రెబ్బలు తింటే డాక్టర్‌తో పని ఉండదిక..


కర్నూలు, 6 ఆగస్టు (హి.స.)మన వంటింట్లో ఎన్నో సహజ ఔషధాలు దాగున్నాయి.. మీరు తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే.. పచ్చి వెల్లుల్లి మీకు అద్భుతంగా సహాయపడుతుంది. దీనికి బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు..

పచ్చిగా ఉందనుకునేరు.. పవర్‌ఫుల్ దివ్యౌషధం.. రెండే రెండు రెబ్బలు తింటే డాక్టర్‌తో పని ఉండదిక..

వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వెల్లుల్లి మన ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఇది అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న సహజ సూపర్‌ఫుడ్ కూడా.. వెల్లుల్లిని ఉడికించి తిన్నా.. లేదా పచ్చిగా.. ఇలా ఎలా తిన్నా మంచిదే.. కానీ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మీకు మరిన్ని పోషకాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ రోగనిరోధక శక్తిని పెంచడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు, ఇది మీ శరీరానికి మంచిదిగా చెబుతున్నారు. అందుకే.. మీ దినచర్యలో పచ్చి వెల్లుల్లిని చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..

వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, ఇతర పోషకాలకు మంచి వనరు. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

మీరు తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే, పచ్చి వెల్లుల్లి మీకు సహాయపడుతుంది. ఇది బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇది మీ శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడంవల్ల జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల తీవ్రత తగ్గుతుంది.

శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది

మన శరీరం నిరంతరం ఆహారం, కాలుష్యం, ఇతర వనరుల నుండి విష పదార్థాలకు గురవుతూ ఉంటుంది. పచ్చి వెల్లుల్లి హానికరమైన పదార్థాలను బయటకు పంపడం ద్వారా మీ కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో సల్ఫర్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి హెవీ మెటల్ పాయిజనింగ్ నుంచి రక్షించాయి. కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

ఆరోగ్యకరమైన ప్రేగు మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మీ శరీరం ఆహారాన్ని మరింత సమర్థవంతంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే, దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన గట్ బాక్టీరియాను నియంత్రణలో ఉంచుతాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు మద్దతు ఇస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

డాక్టర్ బన్సాల్ ప్రకారం.. వెల్లుల్లిలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ కణాల నష్టం.. వృద్ధాప్యానికి కారణమవుతాయి. పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు.. కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కణ ఉత్పరివర్తనను నిరోధిస్తుంది. కణితి పెరుగుదలను నెమ్మదిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande