అతి భారీ వర్షాలు.. రెండు రోజులు పాఠశాలలు బంద్‌.. IMD హెచ్చరికతో విద్యాశాఖ కీలక నిర్ణయం
ఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీలగిరి, విరుదునగర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. కోయింబత్తూర్‌, తేని సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
్


ఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీలగిరి, విరుదునగర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. కోయింబత్తూర్‌, తేని సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగే పడే అవకాశం ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజు, రేపు తమిళనాడుతో పాటు కేళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. కేరళ, తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. IMD ప్రకారం, రాబోయే 3 నుండి 4 రోజుల్లో తమిళనాడు, కేరళ, మాహే, కోస్టల్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి.

ఈ వాతావరణ పరిస్థితులు నేడు జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఉంటాయని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande