రుధిర క్షేత్రం నుండి లక్ష్మిపేట దాకా..
అమరావతి, 6 ఆగస్టు (హి.స.)చుండూరు మారణహోమం జరిగి ఆగస్టు (6) నాటికి 34 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో నాటి ఉద్యమం ఫ్రభావ పర్యవసానాలను అంచనా వేయాల్సి ఉంది. చుండూరు ఉద్యమం ఎన్నో కొత్త అంశాలను భారతదేశంలోకి తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ
రుధిర క్షేత్రం నుండి లక్ష్మిపేట దాకా..


అమరావతి, 6 ఆగస్టు (హి.స.)చుండూరు మారణహోమం జరిగి ఆగస్టు (6) నాటికి 34 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో నాటి ఉద్యమం ఫ్రభావ పర్యవసానాలను అంచనా వేయాల్సి ఉంది. చుండూరు ఉద్యమం ఎన్నో కొత్త అంశాలను భారతదేశంలోకి తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటీ యాక్ట్‌ ఆచరణబద్ధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అయ్యాయి. దళితుల ఆత్మగౌరవ ఉద్యమం ఒక చారిత్రక జాతీయ ఉద్యమంగా మలుపు తిరగడమే గాక రాష్ట్రపతిగా దళితుడిని నియమించాలనే ప్రతిపాదన వరకు వెళ్లింది. 107 మంది ఎంపీలు ఆనాటి రాష్ట్రపతి ఆర్‌.వెంకటరామన్‌ని కలవడానికి వెళ్లినప్పుడు ఆయన నిరాకరించగా, అసలు దళితుడే రాష్ట్రపతిగా ఉండాలి అనే నినాదానికి చుండూరు ఉద్యమం కారణమైంది. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నిర్వహించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande