దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)ముంబయి: దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు.. నేడు వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 76.14 పాయింట్ల లాభంతో 80,786.39 వద్ద, నిఫ్టీ 11.2 పాయింట్ల లాభంతో 24,660.75 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 87.72గా కొనసాగుతోంది.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, ట్రెంట్ షేర్లు రాణిస్తుండగా.. కోల్ ఇండియా, సిప్లా, టెక్ మహీంద్రా, టీసీఎస్, హీరో మోటార్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ