విశాఖ, 9 ఆగస్టు (హి.స.)విశాఖలోని రుషికొండ తీరంలో శుక్రవారం రెండు సముద్ర ముళ్ల కప్పలు (పఫర్ ఫిష్‌లు) కనిపించాయి. ఏవైనా వీటిపై దాడి చేస్తే గాలిని పీల్చుకొని బంతిలా మారిపోతాయి. అప్పుడు వాటి చర్మంపై మొనదేలిన ముళ్లు వస్తాయి. అవి గుచ్చుకుంటే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ భయానికే వీటి జోలికి ఏ జీవులూ వెళ్లవు. ఇవి సముద్రంలో చిన్న చేపలు, నాచు తిని మనుగడ సాగిస్తాయని విశాఖ సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. పఫర్ ఫిష్‌లతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆ రెండింటిని మత్స్యకారులు సాగర జలాల్లో వదిలారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు