అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంబేడ్కర్ బంధువు ఇంట్లో రూ.2కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన.. భారీగా ఆస్తులు కూడగట్టారు. అంబేడ్కర్‌కు 3 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలో ఆయనకు ఖరీదైన భవనం ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ