తిరుమల, 17 సెప్టెంబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో (Tirumala) దాదాపు వారంరోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
మరోసారి కొండపై కంపార్టుమెంట్లన్నీ నిండి..క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ (Krishnateja Guest House) వరకూ పెరిగింది. దీంతో టోకెన్లు లేకుండా ఇప్పటికే క్యూలైన్లో ఉన్న భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని, ఇప్పటి నుంచి క్యూలైన్లోకి వెళ్లేవారికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4-5 గంటల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనభాగ్యం కలుగుతుందని పేర్కొంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి