అంధ విద్యార్థులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన CM రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణను అందజేశారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ

ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణను అందజేశారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులు లైవ్లో పాట పాడి వినిపించారు. తర్వాత వారు పాడిన పాటల సీడీని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎసీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా దామెర మండల పరిధిలోని పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ ఇటీవలే రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళ్తుండగా అతడిని కొందురు దుండగులు రైలులోంచి తోసేయగా రెండు కాళ్లను కోల్పోయాడు. దీంతో రాహుల్కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు ప్రభుత్వం సాయం చేసింది. ఈ మేరకు రాహుల్ ఇవాళ కటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande