హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. మానేరుపై గన్నేరువరంలో హై లెవల్ బ్రిడ్జి సహా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ అభివృద్ధి కోసం కోసం రూ. 868 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF Fund) లో భాగంగా రూ.150 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మానేరుపై గన్నేరువరంలో హై లెవల్ బ్రిడ్జి కోసం రూ.77 కోట్లు, అర్నకొండ-మల్యాల డబుల్ రోడ్డు కోసం రూ.50 కోట్లు, వేముల వాడ-సిరికొండ రోడ్డు కోసం రూ.23 కోట్లు మంజూరు చేసింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని కరీంనగర్ ప్రజల ఏళ్లతరబడి కాంక్షించిన కలలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో నిజం అవుతున్నాయన్నారు. గన్నేరువరం హై లెవల్ బ్రిడ్జి 15 ఏళ్ల ప్రజల పోరాటం అని, అర్నకొండ-మల్యాల్ డబుల్ రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. వేములవాడ- సిరికొండ రోడ్డు 20 ఏళ్లుగా ఉన్న అభ్యర్థన అని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు నేను ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నాను. మోడీ నాయక్వతంలో, నితిన్ గడ్కరీ సహకారంతో ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు