తెలంగాణ, వరంగల్. 16 సెప్టెంబర్ (హి.స.)
స్టేషన్ ఘనపూర్ సొసైటీ వద్ద యూరియా కోసం మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య క్యూ లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టోకెన్ లు ఇచ్చిన యూరియా దొరకడం లేదని రోజుల తరబడి ఉండాల్సి వస్తుందని, రైతులు మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. ఉదయం 4 గంటల నుంచే యూరియా కోసం లైన్ లో ఉంటున్న దొరకడం లేదని రైతులు ఆయనకు వివరించారు. ప్రభుత్వం యూరియా సమస్యలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు