మా నోటికాడి కూడు లాక్కోకండి.. గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిందండ్రులు కంటతడి
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) గ్రూప్-1 ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని దయచేసి మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు, రాజకీయ వివాదం నేపథ్యం
గ్రూప్ వన్


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

గ్రూప్-1 ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని దయచేసి మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు, రాజకీయ వివాదం నేపథ్యంలో ర్యాంకులు సాధించిన 200 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన పేరెంట్స్.. ఒక్కొ పోస్టును రూ.3 కోట్లు వెచ్చించి పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాలో చాలా మంది కూటికి లేని వాళ్లం ఉన్నాం. రూ. 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. పస్తులుండి మా పిల్లలను చదివించాం. తప్పుడు ఆరోపణల వల్ల మా పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత? అంటూ మీడియా సమావేశంలోనే ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande