శివన్నగూడ రిజర్వాయర్ పనుల పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) శివన్నగూడ రిజర్వాయర్ పనుల పై ఇరిగేషన్ శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం సభ్యులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివన్న గూడెం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

శివన్నగూడ రిజర్వాయర్ పనుల పై

ఇరిగేషన్ శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం సభ్యులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

శివన్న గూడెం రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులు మొదలు కాలేదని వెంటనే రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. శివన్న గూడెం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నప్పటికీ ఆ రిజర్వాయర్ లోకి ఎక్కడి నుంచి నీటిని తరలించాలని ఆలోచన గత ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు.

తాను చొరవ తీసుకొని సంబంధిత మంత్రి, నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎదుల్ల రిజర్వాయర్ నుంచి శివన్నగూడ రిజర్వాయర్ కు నీటిని తరలించేలా 1800 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకొచ్చామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande