'నాలా కబ్జాలను వెంటనే తొలగించాలి'.. అధికారులకు ఎంపీ రఘునందన్ రావు సూచనలు
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) బీహెచ్ఐఎల్ చౌరస్తా నుంచి అమీన్ పూర్ వరకు ఉన్న నాలా ఆక్రమణలను తొలగించి, వాటిని పునరుద్ధరించాలని, అందుకు రూ.100 కోట్లు కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ను కోరారు. మంగళవారం బీహెచ్
Raghunandan Rao


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

బీహెచ్ఐఎల్ చౌరస్తా నుంచి

అమీన్ పూర్ వరకు ఉన్న నాలా ఆక్రమణలను తొలగించి, వాటిని పునరుద్ధరించాలని, అందుకు రూ.100 కోట్లు కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ను కోరారు. మంగళవారం బీహెచ్ఐఎల్ చౌరస్తా నుంచి అమీన్ పూర్ కు వెళ్లే రహదారిని, నాలా పనులను ఎంపీ రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, శేరిలింగంపల్లి జెడ్సీ హేమంత్ బోడ్డరే, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.

శేరిలింగంపల్లి నుంచి వచ్చే నాలాకు సంబంధించి బీహెచ్ఎల్ చౌరస్తా వద్ద మూడు ఖానాలు మూసుకుపోయాయని, కేవలం ఒకే ఒక్క ఖానా ద్వారా మురుగునీరు ప్రవహిస్తుందని, నాలా పొడుగునా కబ్జాలు జరిగాయని, నాలా కబ్జాలను వెంటనే తొలగించాలని ఎంపీ రఘునందన్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కు సూచించారు. బీహెచ్ఐఎల్ నుంచి సుల్తాన్ పూర్ డివైస్ వరకు నాలా అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించి 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని అన్నారు. మిగతా అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన చేపట్టాలని ఎంపీ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande