దేశంలోనే పాస్పోర్ట్ జారీలో ఐదో స్థానంలో తెలంగాణ.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) దేశంలోనే పాస్పోర్ట్ జారీలో ఐదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం అఫ్టల్ గంజ్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని
మంత్రి పొన్నం


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

దేశంలోనే పాస్పోర్ట్ జారీలో ఐదో

స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం అఫ్టల్ గంజ్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి మెట్రో లో ప్రారంభమైన మొదటి పాస్ పోర్ట్ కేంద్రం ఎంజీబీఎస్ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో దేశంలోనే 5 వ స్థానంలో ఉందని, తెలంగాణలో 5 పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయని, బేగంపేట ప్రధాన పాస్ పోర్ట్ కేంద్రంగా నిలిచిందని అలాగే ఎంజీబీఎస్, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ లలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ లో రోజుకు 4500 పాస్ పోర్ట్ లు ఇచ్చే సామర్థ్యం ఉందని, 750 నుండి 1200 స్లాట్స్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande