న్యూఢిల్లీ, 16 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కష్టాలను పరష్కరించాలని, అందుకు అవసరమైన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమెతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఖరీప్ సీజన్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రబీ సీజన్ లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ముందుగానే రైతులకు ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలన్నారు. జియో పొలిటికల్ కారణాల వల్లనే సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు