నారాయణపేట, 16 సెప్టెంబర్ (హి.స.)
అతి పురాతనమైన మక్తల్ పడమటి ఆంజనేయస్వామి కోనేరు పునరుద్ధరణకు పనులను మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం పర్యవేక్షించారు. రాతి కట్టడంతో గ్యాపులో కాంక్రీటు లేకుండా టేక్కికల్ ప్రకారం నిర్మించిన కోనేరు అపురూపంగా ఉందని.. దాన్ని కాపాడి పడమటి అంజన్న దర్శనానికి వచ్చే భక్తుల కాళ్ళు చేతుల ప్రక్షాళనకు కోసం కోనేరును అందుబాటులో ఉంచి భావితరాలకు అందించాల్సి బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దీన్ని సంబంధిత పనుల పురోగతిపై అధికారుల అశ్రద్ధ చూపడం వల్లనే ఎల్లవాళ్ళకు డంపింగ్ యార్డ్ గా మారిపోయిందని, గత పాలకుల ఆశ్రద్ధ వల్ల చుట్టు పక్కల ఇళ్ల నివాసులకు చెత్త డంపింగ్ యార్డ్ గా మారిపోయి పిచ్చి మొక్కలు పెరిగి పోయాయని తెలిపారు. ఇంటి ఇంటి కులదైహహహఢవం పడమటి ఆంజనేయ స్వామికి సేవ చేయాలని సూచించారు. అపురూప పురాతన కట్టడాన్ని భావితరాలకు అందించాలని భక్తులకు కోనేటి సౌకర్యం కల్పించాలని గత నెల రోజులుగా కోనేరు పునర్ వైభవం తీసుకురావడానికి మంత్రిగా తన వంతు కృషి చేస్తున్నానని అందుకు సంబంధించిన అధికారుల నుంచి చేయూత నివ్వడంలేదని ఇది సరికాదనే మొక్కలు పడమటి ఆంజనేయ స్వామి జాతర తిరుణాల ఉత్సవాల వరకు కోనేరు పునరు ద్ధరణ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..