నాగర్ కర్నూల్, 16 సెప్టెంబర్ (హి.స.)
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, కలెక్టర్ శ్రీ సంతోష్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులకు ప్రభుత్వమే తల్లి, తండ్రి అని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించి విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టి మెనూ మార్చి పౌష్టిక ఆహారాన్ని అందించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటర్ ప్లాంట్ ప్రారంభంతో విద్యార్థులకు 24 గంటల శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందని, పాఠశాలలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని, ముఖ్యంగా నీటివల్ల వచ్చే వ్యాధులు వైదొలుగుతాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు