నల్గొండ జిల్లా పోక్సో కోర్టు జడ్జి జస్టిస్ రోజారమణి మరో సంచలన తీర్పు..
నల్గొండ, 16 సెప్టెంబర్ (హి.స.) ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి కఠిన శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు జడ్జి జస్టిస్ రోజారమణి మంగళవారం ఉదయం మరో సంచలన తీర్పు వెల్లడించారు. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువు
నల్గొండ జడ్జ్


నల్గొండ, 16 సెప్టెంబర్ (హి.స.)

ఓ బాలికపై లైంగిక దాడికి

పాల్పడిన వృద్ధుడికి కఠిన శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు జడ్జి జస్టిస్ రోజారమణి మంగళవారం ఉదయం మరో సంచలన తీర్పు వెల్లడించారు. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక మార్చి 28, 2023న బడికి పోయి వచ్చి ఇంట్లో నిద్రపోతుంది. నల్లగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు మర్రి ఊషయ్య, బాలిక దగ్గరికి వెళ్లి నిద్రలేపి తినుబండారాలు ఇచ్చి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన పై బాధితురాలి తల్లికి తెలియడంతో, మరుసటి రోజు 29న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అప్పటి రూరల్ ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల విచారణ అనంతరం మంగళవారం కేసు ఫైనల్ కు వచ్చింది. దీంతో జడ్జి రోజారమణి సాక్షాదారాలు, పూర్వాపరాలను పరిశీలించి, ఊషయ్యను దోషిగా నిర్ధారించి, 24 ఏళ్ల జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధించారు. ఈ కేసులో నిందితునికి, బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందిగా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande