హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
అధికారులు కొత్తగూడెంలో ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వైజాగ్ లో పట్టుబడ్డ ఉగ్రవాదుల ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కొత్తగూడెం కి చెందిన యువకుడి ఫొటోలు ఉన్నాయన్న సమాచారంతో ఎన్.ఐ.ఏ అధికారులు సుమారు 10 వాహనాలలో బస్టాండ్ సమీపంలోని ఒక ఇంటిని మంగళవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చుట్టుముట్టారని తెలుస్తుంది.
ఎన్ ఐ ఏ అధికారులు ఉదయం 10 గంటల వరకు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ కొత్తగూడెంలో తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేయడం పట్ల ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు మాత్రం ఎన్.ఐ. ఏ అధికారుల దాడులని ధ్రువీకరించడం లేదు. ఈ ఆకస్మిక దాడులలో ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే సమాచారం తెలియడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..