హీరోయిన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ పై బీఆర్ఎస్ లో కుట్ర: సామరామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) కేసీఆర్ కుటుంబం నుంచి కవితను బయటకు పంపినట్లుగానే కేటీఆర్ ను కూడా బటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను పక్కకు నెట్టి బీఆర్ఎస్ పగ
రామ్మోహన్ రెడ్డి


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) కేసీఆర్ కుటుంబం నుంచి కవితను బయటకు పంపినట్లుగానే కేటీఆర్ ను కూడా బటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను పక్కకు నెట్టి బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టాలని ఓ పెద్ద వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ వ్యూహం పన్నుతున్న వ్యక్తి వెనుక బీజేపీ నేతలు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన సామ రామ్మోహన్ రెడ్డి... త్వరలోనే ఈ వ్యవహారం బయటపడుతుందన్నారు. ఈ పరిణామాలపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లోతుగా అధ్యయనం చేసి ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. గతంలో నేను చెప్పిన చాలా అంశాలు నిజయం అయ్యాయని, కేటీఆర్-నారా లోకేశ్ రహస్యంగా భేటీ అయ్యారని చెప్పాను. బిజినెస్ డీల్ కోసం కేటీఆర్, లోకేశ్ భేటీ అయ్యారని ఆరోపించారు.

బెంగళూరులోని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ లో కేటీఆర్ ను లోపలికి పంపించే వ్యూహం మొదలైందని సామా రామ్మోహన్ ఆరోపించారు. గతంలో హైదరాబాద్ లో సెలబ్రెటీల డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఓ హీరోయిన్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో కేటీఆర్ పేరు ప్రస్తావన ఉందని దాని ఆధారంగా కేటీఆర్ పై కుట్ర జరుగుతోందని సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న ఓ ట్రబుల్ షూటర్.. హీరోయిన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande