పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
తెలంగాణ, సూర్యాపేట. 16 సెప్టెంబర్ (హి.స.) సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి వద్ద వారు మంగళవారం ధర్నా చేశారు. ఈ
ఉద్యోగుల ధర్నా


తెలంగాణ, సూర్యాపేట. 16 సెప్టెంబర్ (హి.స.)

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి వద్ద వారు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. గత ఐదు నెలల నుంచి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 126 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని, కాబట్టి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande