తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన జాగృతి నాయకులు
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. మంగళవారం పెద్ద ఎత్తున జాగృతి నాయకులు కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొ
జాగృతి


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. మంగళవారం పెద్ద ఎత్తున జాగృతి నాయకులు కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande