అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ప్రకారం.. దసరా పండుగకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు 12 రోజులు రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ