హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)
అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజేషన్ చేసుకొని రావాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని, ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారిగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
సూచించిన మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు