మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కు షాక్.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు
తెలంగాణ, నల్గొండ. 19 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు పోలీసులు షాకిచ్చారు. గతంలో కేటీఆర్పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గాదరి కిషోర్పై కేసు నమోదు అయింది. దీంతో ఆ
మాజీ ఎమ్మెల్యే


తెలంగాణ, నల్గొండ. 19 సెప్టెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ నేత, తుంగతుర్తి మాజీ

ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు పోలీసులు షాకిచ్చారు. గతంలో కేటీఆర్పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గాదరి కిషోర్పై కేసు నమోదు అయింది. దీంతో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మోడీ సంకల కూసున్న ఒక బ్రోకర్ గాడు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు” అంటూ సీఎం రమేశ్పై గాదరి కిషోర్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande