తగ్గుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గిందంటే..
ముంబై, 19 సెప్టెంబర్ (హి.స.) గత రెండు, మూడు రోజులుగా బంగారం కాస్త తగ్గుముఖం పట్టింది. అదే దారిలో వెండి కూడా పయనిస్తోంది. తగ్గుతుందంటే ఏదో పెద్ద మొత్తంలో కాదండోయ్‌.. పదుల సంఖ్యలో మాత్రమే తగ్గుతోంది. అదే పెరిగేటప్పుడు మాత్రం వందల సంఖ్యలో ఉంటుంది. ఈ రె
Gold


ముంబై, 19 సెప్టెంబర్ (హి.స.)

గత రెండు, మూడు రోజులుగా బంగారం కాస్త తగ్గుముఖం పట్టింది. అదే దారిలో వెండి కూడా పయనిస్తోంది. తగ్గుతుందంటే ఏదో పెద్ద మొత్తంలో కాదండోయ్‌.. పదుల సంఖ్యలో మాత్రమే తగ్గుతోంది. అదే పెరిగేటప్పుడు మాత్రం వందల సంఖ్యలో ఉంటుంది. ఈ రెండు మూడు రోజుల నుంచి తగ్గుతున్న ధరలు మహిళలకు పెద్దగా ఊరటనిచ్చేలా ఏమి లేవని గమనించవచ్చు.సెప్టెంబర్ 19వ తేదీన శుక్రవారం బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. అయితే తులం బంగారంపై రూ. లక్షా 13వేల వరకు వెళ్లిన పసిడి.. ప్రస్తుతం రూ.లక్షా 11 వేల వరకు తగ్గింది. అంటే ఒక వారం నుంచి చూసుకుంటే భారీగానే తగ్గిందని చెప్పవచ్చు.

దేశీయంగా కాకుండా మల్టీ కమాడిటీ ఎక్స్‌చేంజ్‌లో కూడా ఈ ధరల తగ్గుదల కనిపించింది. నిన్న గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 0.44 శాతం అంటే రూ.483 తగ్గి రూ.1,09,339 వద్ద ట్రేడయ్యింది. అలాగే డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర 0.63 శాతం అంటే రూ.795 తగ్గి రూ.1,26,189కి వచ్చింది.

అలాగే అంతర్జాతీయంగా అమెరికాలో స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం తగ్గి ఔన్సుకు $3,654.29కి వచ్చింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న అంశంపై అమెరికన్ ఫెడ్ పెద్దగా స్పందించలేదు. ఫెడ్ సమావేశం తర్వాత డాలర్ విలువ బలపడింది. ట్రెజరీ రేట్లు కూడా పెరిగాయి. పసిడి ధర మళ్లీ $3,600 వరకూ తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సెప్టెంబర్‌ 19వ తేదీన దేశీయంగా చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,310 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,040 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,890 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,480ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,190 ఉంది.

ఇక వెండి కూడా కిలోపై స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గి ప్రస్తుతం కిలోకు రూ.1,30,900 వద్ద ఉంది. అదే హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో మాత్రం భారీగా ఉంది. కిలో్కు రూ.1,40,900 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande