విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు
తెలంగాణ, కామారెడ్డి. 19 సెప్టెంబర్ (హి.స.) పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషన్నర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోన
కామారెడ్డి కలెక్టర్


తెలంగాణ, కామారెడ్డి. 19 సెప్టెంబర్ (హి.స.)

పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషన్నర్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని వినాయక నగర్లో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు ఎన్డీఆర్ఎఫ్ కింద మంజూరు చేసిన పనులను వెంటనే పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించని కారణంగా సీరియస్గా పరిగణించి వెంటనే సంబంధిత ఏరియా సానిటరీ జవాన్, ఇన్స్పెక్టర్లకు 24 గంటలలో సమాధానం తెలియజేయుటకు షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande