ఎమ్మెల్సీ మర్రి.రాజశేఖర్ నేడు.టీడీపీలో చేరనున్నారు
అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు తెదేపాలో చేరనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాజశేఖర్‌ పసుపు కండువా కప్పుకోనున్నారు. గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైకాపాకు, శాసన మండలి సభ్యత్వానికి ఆ
ఎమ్మెల్సీ మర్రి.రాజశేఖర్  నేడు.టీడీపీలో చేరనున్నారు


అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు తెదేపాలో చేరనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాజశేఖర్‌ పసుపు కండువా కప్పుకోనున్నారు. గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైకాపాకు, శాసన మండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. జగన్‌ ప్రతిసారి మాట ఇచ్చి తప్పడం, పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం.. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా వైకాపాకు రాజశేఖర్‌ గుడ్‌బై చెప్పారు. ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్‌ ఇంకా ఆమోదించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande