మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ సుడిగాలి పర్యటన..
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం మరిపెడ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మరిపెడ రోడ్ లోని పీఏసీఎస్ సొసైటీ గోదాంను పరిశీలించారు. యూరియా స్టాక్, సరఫరా తాలుకు రిస్టార్లు తనిఖీ చేశారు.
అడిషనల్ కలెక్టర్


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం మరిపెడ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మరిపెడ రోడ్ లోని పీఏసీఎస్ సొసైటీ గోదాంను పరిశీలించారు. యూరియా స్టాక్, సరఫరా తాలుకు రిస్టార్లు తనిఖీ చేశారు. యూరియ పంపిణీ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మునిసిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టార్ పరిశీలించారు. వీఆర్వోలు తిరిగి వెళ్లాకా మునిసిపల్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోడల్ స్కూల్ సందర్శించి విద్యార్థుల తరగతి గదులు, పరిసరాలు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి విద్య ప్రమాణాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ నందు టాయిలెట్స్, గ్రౌండ్, సోలార్ సిస్టం ఏర్పాటు చేయాల్సిందిగా విద్యార్థులు అదనపు కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande