ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర సమీక్ష..
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన ఎక్విప్మ
మంత్రి దామోదర


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నీచర్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగుకు మంత్రి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలని డీఎంఈ నరేంద్ర కుమార్ను ఆదేశించారు. ఈ మేరకు సనత్నగర్, ఎల్బీనగర్, కొత్తపేట్ టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్ హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియట్లోని తన చాంబర్లో ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సనత్నగర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ పనులు మరో 6 నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande