భూ సమస్యలను అంకితభావంతో పరిష్కరించాలి : నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్
తెలంగాణ, నాగర్ కర్నూల్. 19 సెప్టెంబర్ (హి.స.) గ్రామ పరిపాలన అధికారులు అంకితభావంతో పనిచేస్తూ రైతులకు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్ కా
అదనపు కలెక్టర్


తెలంగాణ, నాగర్ కర్నూల్. 19 సెప్టెంబర్ (హి.స.)

గ్రామ పరిపాలన అధికారులు

అంకితభావంతో పనిచేస్తూ రైతులకు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తాలూకా స్థాయి గ్రామ పరిపాలన అధికారుల తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ముఖ్యంగా గ్రామాల్లో భూ సమస్యలు ఆధికంగా ఉన్నాయని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కరించి మేలు చేయాలని కోరారు. తెలంగాణలో భూమి విలువ పెరిగిందని దీంతో జీపీఓలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. గ్రామ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, చట్టం ప్రకారం జాగ్రత్తగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande