తెలంగాణ, నిర్మల్. 19 సెప్టెంబర్ (హి.స.)
కిడ్నాప్,మానవ అక్రమ రవాణా కేసులో ఒకరిని అరెస్ట్ చేసి,రిమాండ్ కి తరలిస్తున్నట్టు నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శుక్రవారం బైంసా పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో ఏఎస్పీ మాట్లాడారు.... కుబీర్ మండలం సేవదాస్ తండాకి చెందిన చౌహన్ లావ్ సింగ్ కుమార్తె సోనీ కి రాథోడ్ రామారావు అనే అతను పెళ్లి సంబంధం చూశానని, పాక్షికవైకల్యం కలిగినటువంటి అతన్ని చేసుకోవడం తో ఆర్థికపరంగా మీ కుటుంబం బాగుపడుతుందని నమ్మబలికి బైంసా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల ఓ ఇంట్లో ఆరు రోజుల క్రితం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారనీ పేర్కొన్నారు.
అబ్బాయికి రెండు కాళ్లు లేకుండా ఉండడాన్ని చూసిన అమ్మాయి నిరాకరించింది. దీంతో పిల్ల తండ్రి కి రామారావు డబ్బులు ఇస్తానని, పెళ్లి చేసుకోవాలని సోనీ ని బలవంతంగా జీబులో ఎక్కించే ప్రయత్నం చేశారనీ, అమ్మాయి సోని కేకలు వేయడంతో అందరు అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. వెంటనే బాధితురాలు సోనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మధ్యవర్తి రామారావును నేడు రిమాండ్ కి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు