తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి బదిలీ!
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని ఆలోచన చేస్తోంద
ఫోన్ టాపింగ్


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం

సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే సిట్ (SIT) దర్యాప్తును పరిశీలించడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించే విషయంలో సాధ్యాసాధ్యాలపై న్యాయ నిపుణులతో కూడా సలహాలను ప్రభుత్వం పెద్దలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే, మావోయిస్టుల పేరుతో సామాన్యుల ఫోన్ నంబర్లను ఇచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)ను తప్పుదోవ పట్టించడం, కేంద్ర మంత్రులు, ప్రముఖ న్యాయవాదులు అనే తేడా లేకుండా ఏకంగా రాష్ట్రాల గవర్నర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో కేసు సీబీఐ దర్యాప్తు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ అధికారి కావడం, ఆయన విచారణకు సహకరించకపోవడంతో, ఫోన్ ట్యాపింగ్పై ఆదేశాలు ఇచ్చి వారి పేర్లను ఇప్పటి వరకు బయటపెట్టపోట్టలేదు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించేందుకు గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో డీజీపీ జితేందర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande