లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి: నకిరేకల్ ఎమ్మెల్యే
తెలంగాణ, నల్గొండ. 19 సెప్టెంబర్ (హి.స.) చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నూత
ఎమ్మెల్యే వీరేశం


తెలంగాణ, నల్గొండ. 19 సెప్టెంబర్ (హి.స.)

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో

ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నూతనంగా మంజూరైన హండ్రెడ్ బై 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేసి అర్హులైన పేదలకు కేటాయిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీలా నిర్మాణ పనులను చేపడతామని అన్నారు.

పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంటను పునర్నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా వాలన చేసి అప్పులు మిగిల్చిపోయారని, నేడు ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande