సూర్యాపేటలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బిక్షాటన.. ప్రభుత్వ దవాఖానలో నిలిచిన సేవలు
తెలంగాణ, సూర్యాపేట. 19 సెప్టెంబర్ (హి.స.) ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు
అవుట్ సోర్సింగ్


తెలంగాణ, సూర్యాపేట. 19 సెప్టెంబర్ (హి.స.)

ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న

జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు పలుమార్లు తమ సమస్యలు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయడంతోపాటు ప్రతి నెల 5వ తేదీ లోపే వేతనాలను చెల్లించాలన్నారు. బిక్షాటన చేసి పూట గడుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదని మండిపడ్డారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో దవాఖానలో రోగులకు వైద్య సేవల నిలిచిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande