తాను ఫిరాయింపులను సమర్థించను.. కడియం శ్రీహరి
తెలంగాణ, హనుమకొండ. 19 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో అన్ని పార్టీల్లోని 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం వారు వారు విలేకరులతో మాట
కడియం శ్రీహరి


తెలంగాణ, హనుమకొండ. 19 సెప్టెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో అన్ని పార్టీల్లోని 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం వారు వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారన్నారు. అప్పుడు లేని విలువలు ఇప్పుడే వచ్చాయా అన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నానన్నారు. తాను భూకబ్జాలు చేయలేదు.. సెటిల్ మెంట్లు చేయలేదు.. అవినీతి చేయలేదని అన్నారు. ఏనాడు పదవులను అడుక్కో లేదని.. కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎం చేశారన్నారు. తాను ఫిరాయింపులను సమర్థించను.. ఇష్టాయిష్టాల కన్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లానన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande