మావోయిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ సంచలన ప్రకటన
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) మరోసారి మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. సాయుధ పోరాట విరమణ ప్రకటన.. అభయ్ వ్యక్తిగతంగా పేర్కొంది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ తమకు సంబంధం లేదంటూ మావోయిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి
మావోయిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ సంచలన ప్రకటన


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

మరోసారి మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. సాయుధ పోరాట విరమణ ప్రకటన.. అభయ్ వ్యక్తిగతంగా పేర్కొంది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ తమకు సంబంధం లేదంటూ మావోయిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ స్పష్టం చేశారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మావోయిస్ట్‌ పార్టీ పేర్కొంది.

కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితం. ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేది. ఆయుధాలు వదిలి పెడదామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంది. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా.. సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్యగా మావోయిస్టు పార్టీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande