కామారెడ్డి డిక్లరేషన్ను పట్టించుకోని కాంగ్రెస్.. తీన్మార్ మల్లన్న
తెలంగాణ, హనుమకొండ. 19 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వరంగల్
తీన్మార్ మల్లన్న


తెలంగాణ, హనుమకొండ. 19 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి

రెండేళ్లు అవుతున్నా కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. పది అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు.ప్రొపెసర్ జయశంకర్ సార్ ను జాతిపితగా గుర్తించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని రెండో అంశంగా పెట్టుకున్నామన్నారు. బీసీలకు ప్రతి సంవత్సరం లక్ష కోట్లు బడ్జెట్ గా పెట్టాలని కామన్ మినిమంలో పెట్టామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి కనీసం రెండువేల కోట్లు పెట్టలేదన్నారు. బీసీలను మోసం చేశారన్నారు. బీసీలలో భూమిలేని కుటుంబాలు 16 లక్షల ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే రెండు ఎకరాలు ఇస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande