బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.) ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈనెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఏపీలో పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రవ్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈనెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఏపీలో పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది IMD.కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.

శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande