ఏపి లిక్కర్ స్కాం.కేసులో నాట్ అధికారుల సోదాలు
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, చెన్నైలో చేపట్టిన సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు వైఎస్ అని
ఏపి లిక్కర్ స్కాం.కేసులో నాట్ అధికారుల సోదాలు


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, చెన్నైలో చేపట్టిన సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్‌, కొండాపూర్‌లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేసి.. హార్డ్ డిస్క్‌‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలు కూడా ముగిసినట్లు అధికారులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande